ఈటలను పరామర్శించిన బండి సంజయ్‌
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

ఈటలను పరామర్శించిన బండి సంజయ్‌

ఈటలతో మాట్లాడుతున్న బండి సంజయ్‌ చిత్రంలో వివేక్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: పాదయాత్రలో అస్వస్థతకు గురై జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, భాజపా నాయకుడు ఈటల రాజేందర్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ శనివారం పరామర్శించారు. పరామర్శించిన వారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్‌లో గెలిచేందుకు ప్రభుత్వం బరితెగించి అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజేందర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని