వైద్యులు మానవతా దృక్పథంతో మెలగాలి
eenadu telugu news
Published : 01/08/2021 02:03 IST

వైద్యులు మానవతా దృక్పథంతో మెలగాలి


మెడిసిటీ వైద్య కళాశాల స్నాతకోత్సవంలో పతకాలు సాధించిన విద్యార్థులతో గవర్నర్‌ తమిళి సై

మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: వైద్యులు ధనార్జనే ధ్యేయంగా కాకుండా రోగుల పట్ల మానవతా దృక్పథంతో మెలగాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై అన్నారు. శనివారం మేడ్చల్‌ మండల పరిధి ఘన్‌పూర్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల స్నాతకోత్సవంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2015 విద్యా సంవత్సరంలో కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 13వ బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు అందజేశారు. అనంతరం విద్యార్థులనుద్ధేశించి ప్రసంగిస్తూ.. వైద్య విద్య చదవాలని లక్షల మంది కళ కంటారని, కానీ చదివే అవకాశం కొంతమందికే దక్కుతుందన్నారు. చిన్న వయస్సులో గవర్నర్‌గా వచ్చిన తాను కొత్త రాష్ట్రానికి ఒక వైద్యురాలిగానే వ్యవహరిస్తూ పాలిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని