చిత్రవార్తలు
eenadu telugu news
Published : 01/08/2021 03:09 IST

చిత్రవార్తలు

చక్రవ్యూహం

ఎన్ని పైవంతెనలు కట్టినా.. మెట్రో రవాణా అందుబాటులోకి వచ్చినా..  ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరడం లేదు.  శనివారం సాయంత్రం బేగంపేట వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. ఫ్లై ఓవర్‌ పైన, దిగువన వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్లేందుకు గంటన్నర సమయం పట్టింది.


షటిల్‌ కాక్‌ కారు సందడి

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు విజయాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ‘షటిల్‌ కాక్‌’ కారు కంట్రీక్లబ్‌లో సందడి చేసింది. షటిల్‌ కాక్‌ను పోలిన కారును సుధాకార్స్‌ మ్యూజియం అధినేత సుధాకర్‌ తయారు చేయగా శనివారం కంట్రీక్లబ్‌ సీఎండీ రాజీవ్‌రెడ్డి కారును ప్రారంభించారు.

-న్యూస్‌టుడే, సోమాజిగూడ


సామాజిక మాధ్యమాలపై నాంపల్లిలో శనివారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో జాతీయ కార్యశాల నిర్వహించారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ప్రధాన కార్యదర్శి సులోచన, నగర నేతలు డాక్టర్‌ మాలతి లత, శ్యామల, నాగపరిమళ తదితరులు స్వాగతం పలికారు.


లేదు బలిమి.. చెలిమే కలిమి

చాదర్‌ఘాట్‌కు చెందిన మహ్మద్‌ కరీం దివ్యాంగుడు. భిక్షాటన చేసేందుకు గబగబా నాలుగు అడుగులు వేయలేని స్థితి. అయినా ఆయనకు భూమన్న అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. అతనే ఆయనకు బలం. రోజూ ఉదయాన్నే ఈ తోపుడు బండిలో మిత్రుణ్ని యాచించే స్థలానికి తీసుకెళతాడు. తరవాత ఇంటికి తీసుకొస్తాడు. మిత్రుడి సహచర్యంలో అంగ వైకల్యాన్ని మరిచిపోతున్నా అని కరీం పేర్కొనగా.. అతనికి సహకరించడమే తనకు ఆనందం అన్నాడు భూమన్న. అసెంబ్లీ గన్‌పార్క్‌ వద్ద తీసిన చిత్రమిది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని