TS News: లాల్‌దర్వాజా బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
eenadu telugu news
Updated : 01/08/2021 13:38 IST

TS News: లాల్‌దర్వాజా బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల లాల్‌దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాతబస్తీలో సింహవాహని మహంకాళి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌, భాజపా నేత విజయశాంతి తదితరులు దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

 

దర్శనం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మత సామరస్యానికి లాల్‌దర్వాజా బోనాలు ప్రతీక అని ఆయన చెప్పారు. బోనం ఎత్తిన ఆడబిడ్డలందరికీ రేవంత్‌ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నిజాం పాలనలో అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో కలరా వచ్చినపుడు నిజాం నవాబు అమ్మవారికి మొక్కుకుని బంగారు పడక సమర్పించారని గుర్తు చేశారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు సర్వమానవాళికి అమ్మవారి ఆశీర్వాదం కలగాలని రేవంత్‌ ఆకాంక్షించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని