టైరు పేలి ఆటో బోల్తా.. ఇద్దరు రైతుల మృతి
eenadu telugu news
Updated : 02/08/2021 01:40 IST

టైరు పేలి ఆటో బోల్తా.. ఇద్దరు రైతుల మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నర్సింహులు, పాండు

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: తాము పండించిన కూరగాయలను మార్కెట్‌లో విక్రయించేందుకు తీసుకెళుతుండగా ఆటో ట్రాలీ బోల్తా పడి ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై ప్రసాదరావు కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం చీమలదారి కోనాపూర్‌ గ్రామానికి చెందిన రైతులు నర్సింహులు, చాకలి పాండు, వెంకటయ్య, మోహన్‌, మల్లేశం, సాయిలు తాము పండించిన కూరగాయలను పటాన్‌చెరు, మూసాపేట మార్కెట్లలో విక్రయించేందుకు గ్రామానికి చెందిన సతీష్‌ ఆటోట్రాలీలో శనివారం రాత్రి బయల్దేరారు. పటాన్‌చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై భారత్‌పెట్రోల్‌ బంకు సమీపానికి రాగానే వెనుక టైర్‌ పేలి ఆటో బోల్తా పడింది. దీంతో నర్సింహులు(43) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. చాకలి పాండు(40) సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మిగిలిన నలుగురిలో వెంకటయ్య, మోహన్‌లు తీవ్రంగా గాయపడటంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మల్లేశం, సాయిలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుడు నర్సింహులు భార్య అనిత ట్రాలీ డ్రైవర్‌ అతివేగంగా నడపడంతోనే ప్రమాదం సంభవించినట్లు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని