నీటి అదుపు.. దిగుబడులు అధికం
eenadu telugu news
Published : 02/08/2021 00:55 IST

నీటి అదుపు.. దిగుబడులు అధికం

సూక్ష్మసేద్య పరికరాలతో అన్నదాతకు లాభం

జిల్లాకు 1025 యూనిట్ల మంజూరు

న్యూస్‌టుడే, పరిగి

బిందు పద్ధతిలో కొత్తిమీర

నిత్యం రెక్కల కష్టంతో బంగారు పంటలు పండించే అన్నదాతకు ఆధునిక పరికరాలు అవసరం. వీటితో నీటి వృథాను అరికట్టవచ్ఛు తాను కొంత ఉపశమనం పొందుతూ సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్ఛు అధిక దిగుబడులు సాధించవచ్ఛు ఆర్థికంగా ఎదగవచ్ఛు అందుకోసమే ఈ సంవత్సరానికి జిల్లాకు ఉద్యానశాఖ కింద 1025 యూనిట్లు సూక్ష్మసేద్యం పరికరాలు మంజూరయ్యాయి. వీటిలో 525 యూనిట్లు బిందు, 500 యూనిట్లు తుంపర పరికరాలున్నాయి. దీనికోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి అవసరం, తద్వారా కలిగే ప్రయోజనం తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

38వేల ఎకరాల్లో ..

జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 27వేల ఎకరాల్లో కూరగాయలు, 11వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలు సాగులో ఉన్నాయి. వ్యవసాయ పరంగా తలెత్తుతున్న వాతావరణ సమస్యలు, పెరిగిన పెట్టుబడులు తదితరాలు అన్నదాతలకు తలకుమించిన భారంగా మారుతున్నాయి. రానురాను పండ్లతోటలపై దృష్టి సారించడంతో క్రమేణా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూడా మొక్కలు పంపిణీ చేశారు.

నాణ్యమైన ఉత్పత్తులు

అటు తోటలకు ఇటు కూరగాయలకు సాధారణ పద్ధతిలో నీటి తడులను ఇవ్వడం తెలిసిందే. దీంతో మోతాదుకు మించి మొక్కలకు నీరందితే అవి చనిపోవడం లేదా కుళ్లిపోవడం వంటివి ఏర్పడి దిగుబడులపై ప్రభావం పడేది. బిందు, తుంపర సాగు విధానం అమలు చేయడం ద్వారా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతున్నాయి. విపణిలోనూ వీటికి మంచి గిరాకీ వస్తోందని విక్రయదారులు అంటున్నారు.

మామిడి తోట

డిమాండ్‌ పెరుగుతోంది

జిల్లా రైతులు అచ్చంగా వ్యవసాయంపైనే ఆధారపడటంతో సూక్ష్మసేద్యానికి రోజు రోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. కూలీల కొరత కూడా ప్రధాన కారణంగా మారింది. పంటల సీజన్‌ సమయంలో కర్నూలు జిల్లా నుంచి కూలీలు వస్తేనే రైతులకు వెసులుబాటు కలుగుతోంది. ఇటీవలి కాలంలో కూలీ ధరలు పెరగడం, అందరి పొలాల్లోనూ ఒకేసారి పనులు ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం సూక్ష్మసేద్యం పరికరాలుంటే కొంతైనా సమస్యలను అధిగమించేందుకు అవకాశం కలుగుతుంది. డిమాండ్‌ మేరకు కూడా పరికరాలు పంపిణీ కాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. డీడీలు కట్టిన రైతులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న తరుణంలో మంజూరు కావడంతో ఊరట కలుగుతోంది. నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.

* దాదాపు 11వేల ఎకరాల్లో వివిధ రకాల పండ్లతోటలు సాగులో ఉన్నాయి. స్ప్రింకర్లకు ఒక్కో యూనిట్‌ కింద రూ.13వేల వరకు రాయితీ అందనుంది. మంజూరైన వాటిలో ఎస్టీలకు 8%, ఎస్సీలకు 16%, ఇతరులకు మిగతా వాటిని అందించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

త్వరలో పంపిణీ: చక్రపాణి, జిల్లా ఉద్యానాధికారి

జిల్లాకు అందిన సూక్ష్మసేద్యం పరికరాలను దరఖాస్తు చేసుకున్న వారికి పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా కూలీల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్ఛు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్ఛు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని