విద్యుదాఘాతంతో బాలుడు..
eenadu telugu news
Published : 02/08/2021 01:40 IST

విద్యుదాఘాతంతో బాలుడు..

శ్రీకాంత్‌

హత్నూర: అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఏకైక కుమారుడు విద్యుదాఘాతంతో తనువు చాలించడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కోనంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నీరుడి లక్ష్మయ్య- పోచమ్మ దంపతులకు ఒక కూతురు, కుమారుడు శ్రీకాంత్‌(14) ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకొంటూ జీవనోపాధి పొందుతున్నారు. వానాకాలం సీజన్‌లో వరినాట్లు వేశారు. ఆదివారం శ్రీకాంత్‌ పొలానికి నీరు పెట్టేందుకు స్టార్టర్‌ డబ్బాలో మోటారు ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడి అపస్మారక స్థితికి చేరాడు. పక్క పొలంలో రైతులు చూసి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా వారంతా అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే శ్రీకాంత్‌ మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు తమ నుంచి శాశ్వతంగా దూరం కావడం తట్టుకోలేక తల్లిదండ్రులు బోరున విలపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని