విద్యుదాఘాతంతో రైతు మృతి
eenadu telugu news
Published : 02/08/2021 01:40 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి

మృతుడు అనంతయ్య

చేవెళ్ల గ్రామీణం: మోటర్‌ అన్‌ చేయబోయిన రైతు విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందారు. ఈ సంఘటన చేవెళ్ల మండలం జాలగూడలో చోటుచేసుకుంది. పోలీసులు, రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన తిరుమల అనంతయ్య(60)కు ఎకరంన్నర పొలం పొంది. ముగ్గురు కుమార్తెలు, కుమారుడికి వివాహం చేశారు. అనంతయ్య బీట్‌రూట్‌ పంట సాగుచేశారు. ఆదివారం దాన్ని కడిగేందుకు ట్యాంకులో వేశారు. నీటి కోసం మోటారు అన్‌ చేస్తుండగా.. విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు చూసి వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్టార్టర్‌ కనెక్షన్‌ వైరు ఎలుకలు కట్‌ చేయడంతో ఇలా జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని