దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: మానసిక ఆందోళనతో దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకు చెందిన మాజీ సైనికోద్యోగి రాజ్‌బీర్‌సింగ్‌ కుమార్తె సునంద జాంగ్ర(25) జవహర్‌నగర్‌లోని ఆర్మీ దంత వైద్యకళాశాలలో బీడీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. 2016-17 సంవత్సరంలో ఆర్మీ దంత వైద్యకళాశాలలో చేరిన సునంద కళాశాలలోని వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. ఎంబీబీఎస్‌లో చేరేందుకు ప్రయత్నించినా సీటు లభించకపోవడంతో దంత వైద్యంలో చేరారు. దీంతో తీవ్ర మనోవేదనతో మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మానసిక వైద్యుడితో చికిత్స అందించారు. రెండు రోజుల క్రితం సునంద వీడియోకాల్‌ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడారు. తన వివాహం గురించి తల్లి అడిగినప్పుడు బాగానే ఉన్నారు. శనివారం రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న తండ్రి ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఎంబీబీఎస్‌లో సీటు దొరక్కపోవడంతో మనో వేదనతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని