TS News: ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టంలేకే సొంత అక్కను చంపేశాడు!
eenadu telugu news
Updated : 02/08/2021 06:49 IST

TS News: ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టంలేకే సొంత అక్కను చంపేశాడు!

పథకం ప్రకారమే మట్టుబెట్టిన తమ్ముడు

నిందితులు

గోల్కొండ, న్యూస్‌టుడే: తండ్రి సంపాదించిన ఆస్తిలో అక్కాచెల్లెళ్లకు వాటా ఇవ్వడం ఇష్టంలేకే సొంత అక్కను గొంతుకోసి హత్యచేసిన ఆరిఫ్‌అలీతో పాటు సహకరించిన సోదరులు, భార్యను గోల్కొండ పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. టోలిచౌకి ఆడమ్స్‌కాలనీకి చెందిన ఫకీర్‌అలీ మృతిచెందారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఫకీర్‌అలీకి స్థిరాస్తులున్నాయి. 400 గజాల స్థలం కుమార్తెలకు ఇవ్వాలని నిర్ణయించగా, కుమారులు అడ్డుచెప్పడంతో గొడవలు జరుగుతున్నాయి. ఐదుగురిలో ఓ సోదరి అయెషా ఫాతిమా కోర్టులో కేసు వేయగా.. ఇటీవలే సమన్లు జారీచేసింది. మరో సోదరి రయిసా ఫాతిమా సోదరులతో గొడవ పడేది. దీంతో ఆమెను చంపాలని సోదరులైన మహ్మద్‌ ఆరిఫ్‌అలీ, రవూఫ్‌, హసన్‌, ఆసిఫ్‌ అలీతో పాటు ఆరిఫ్‌అలీ భార్య సమీనాబేగం పథకం రచించారు. గత నెల 29న ఆరిఫ్‌అలీ రయిసా ఇంటికెళ్లి గొడవ పడ్డాడు. కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. కేసు నమోదు చేసిన గోల్కొండ పోలీసులు ఆదివారం నిందితులను అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని