ఆర్థిక ఇబ్బందులతో గృహిణి బలవన్మరణం
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

ఆర్థిక ఇబ్బందులతో గృహిణి బలవన్మరణం

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో గృహిణి బలవన్మరణానికి పాల్పడ్డారు. బోయిన్‌పల్లి సీఐ రవికుమార్‌ వివరాల ప్రకారం.. కర్ణాటక రాయచూరుకు చెందిన భజేందర్‌ అలియాస్‌ విజయ్‌, సోమాజీగూడకు చెందిన వీణా(35) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతను డ్రైవర్‌. ప్రస్తుతం న్యూ బోయిన్‌పల్లి మామాతాజీనగర్‌లో ఉంటున్నారు. నెల రోజులుగా అతను పచ్చ కామెర్లతో బాధపడుతున్నాడు. ఉద్యోగంలోంచి తీసేయడంతో.. ఆర్థిక ఇబ్బందులు వల్ల కారు వాషింగ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. రోజులాగే జులై 31న రాత్రి వీణా హాల్‌లో, విజయ్‌, పిల్లలు పడక గదిలో నిద్రించారు. ఆదివారం అతను లేచేసరికి ఆమె ఉరేసుకుని కనిపించారు. వీణా తండ్రి మహావీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని