‘ఆరు నెలల కిందటే దళిత బంధు ప్రకటించిన సీఎం’
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

‘ఆరు నెలల కిందటే దళిత బంధు ప్రకటించిన సీఎం’

మాట్లాడుతున్న బోయినపల్లి వినోద్‌కుమార్‌, చిత్రంలో మామిడి హరికృష్ణ,
గొరటి వెంకన్న, రసమయి బాలకిషన్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఆరు నెలల కిందటే ‘దళిత బంధు’కు రూపకల్పన పూర్తయిందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కరోనాతో అమలులో ఆలస్యమైందని పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో సాంస్కృతిక సారథి కళాకారుల అవగాహన సదస్సు జరిగింది. సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. దళితుల సాధికారత కోసం బడ్జెట్‌లోనే రూ.వెయ్యి కోట్లను కేటాయించామని గుర్తు చేశారు. రాజకీయ విమర్శలు మాని, వాస్తవాలను గ్రహించాలన్నారు. గతంలో ‘రైతుబంధు’ పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించినట్లే ఇప్పుడు ‘దళితబంధు’ పథకాన్ని అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారని తెలిపారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని