మొహర్రం ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

మొహర్రం ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

సమీక్షిస్తున్న మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ తదితరులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొహర్రం ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్‌ అలీ, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ మహ్మద్‌ సలీం, రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో ఆదివారం మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలతో జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేయాలన్న సీఎం సూచన మేరకు వివిధ విభాగాలతో మంత్రులు చర్చించారు. ప్రార్థనాలయాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, వక్ఫ్‌బోర్డు సీఈఓ షానవాజ్‌ఖాన్‌, నగర సీపీ అంజనీకుమార్‌, అదనపు కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌తో పాటు పలువురు షియా మత పెద్దలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని