వీవీఆర్‌ హౌజింగ్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌కు జరిమానా
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

వీవీఆర్‌ హౌజింగ్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌కు జరిమానా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వినియోగదారుడికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవ్వడంతో పాటు అతని మానసిక వేదనకు కారణమైన వీవీఆర్‌ హౌజింగ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌పై జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చెల్లించిన మొత్తం తిరిగివ్వడంతోపాటు రూ.లక్ష పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.5 వేలు అందించాలని ఆదేశించింది. అమీర్‌పేట్‌లోని వీవీఆర్‌ హౌజింగ్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులు మౌలాలికి చెందిన ఎం.రఘుచందన్‌రావును కలిసి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కేశంపేట్‌ మండలం, సంగెం గ్రామ పంచాయతీ పరిధిలో ‘శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్యారడైజ్‌’ వెంచర్‌లో ప్లాట్లను కొనుగోలు చేయాలని కోరారు. ఆయన రూ.2,25,000 చెల్లించడంతో, 400 గజాల స్థలానికి సేల్‌ డీడ్‌ అందించింది. పలుమార్లు తన స్థలాన్ని చూపించాలని కోరినా దాటవేసింది. రెండేళ్లయినా రిజిస్టర్‌ చేయకపోవడంతో విసిగిపోయిన ఫిర్యాదీదారు కమిషన్‌ను ఆశ్రయించారు. 2019లో ఆ వెంచర్‌కు వెళ్తే, వ్యవసాయం చేస్తున్నారని విన్నవించారు. వాదనలు పరిశీలించిన కమిషన్‌-3 బెంచ్‌ ఫిర్యాదీదారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని