ట్రిపుల్‌ తలాక్‌ చట్టంతో ఎంతమందికి న్యాయం జరిగింది: ఎంపీ అసదుద్దీన్‌
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

ట్రిపుల్‌ తలాక్‌ చట్టంతో ఎంతమందికి న్యాయం జరిగింది: ఎంపీ అసదుద్దీన్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించి, ప్రతిపక్షాల గొంతునొక్కి అమల్లోకి తెచ్చిన ట్రిపుల్‌ తలాక్‌ చట్టంతో ఎంత మంది ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందో చెప్పగలరా..? అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆదివారం ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుస్సాలంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంగా ‘ముస్లిం మహిళా దినోత్సవం’ పేరిట భాజపా వేడుకలు చేసుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోని ముస్లిం మహిళల్లో అత్యధికులు నిరక్షరాస్యులు, నిరుపేదలున్నారని, వారి అభ్యున్నతికి కేంద్ర సర్కారు ఏనాడైనా ఆలోచించిందా..? అని నిలదీశారు. కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. వాస్తవాల్ని దాస్తూ ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారని విమర్శలు గుప్పించారు. యూపీ ఎన్నికల్లో భాజపా ఓటమి ఖాయమని పేర్కొన్నారు. కుల, మతాలకతీతంగా ఒకే చట్టాన్ని తీసుకొచ్చే సత్తా కేంద్రానికి ఉందా..? గోరక్షణ పేరిట ముస్లిం యువకుల్ని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా..? దీనిపై లోక్‌సభలో చర్చకు సిద్ధమా..? అని మోదీకి సవాల్‌ విసిరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని