TS news: అట్టహాసంగా ఫలహారం బండి ఊరేగింపు
eenadu telugu news
Updated : 02/08/2021 16:53 IST

TS news: అట్టహాసంగా ఫలహారం బండి ఊరేగింపు

హైదరాబాద్‌: నగరంలోని జాంబాగ్‌లో అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలహారం బండి ఊరేగింపును ప్రారంభించారు. ప్రజలంతా అమ్మవారి దీవెనలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అమ్మవారి వివిధ రూపాల్లో ఉన్న కళాకారుల ప్రదర్శనలతోపాటు ఎమ్మెల్యే మైనంపల్లి నృత్యాలు ఆకట్టుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని