మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా సురేందర్‌కుమార్‌
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా సురేందర్‌కుమార్‌


నియామక పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే

పరిగి, న్యూస్‌టుడే: పరిగి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా అంతిగారి సురేందర్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం తమ నివాసం వద్ద ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఉపాధ్యక్షుడిగా ఎండీ సమీర్‌, సభ్యులుగా ఎం.బాబు, జి.నాగమ్మ, పి.ప్రభులింగం, ఆంగోతు సేవ్యానాయక్‌, డప్పు చంద్రశేఖర్‌, యు.వెంకటయ్య, ఎస్‌.బుచ్చిలింగం, ఆకారపు మాణిక్యం, ఛైర్మన్‌ ప్రాథమిక సహకారం సంఘం, డీఎం మార్కెటింగ్‌, ఉద్యానశాఖ ఏడీ, మున్సిపల్‌ ఛైర్మన్‌ సభ్యులుగా కొనసాగనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌, ఎంపీపీ అరవింద్‌రావు, విపణి మాజీ ఛైర్మన్‌ ఆర్‌.ఆంజనేయులు, ఎస్‌.భాస్కర్‌, మీర్‌మహమూద్‌అలీ, పి.వెంకటయ్య, పి.ప్రభాకర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి అందజేత

పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం అని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. 66మందికి రూ.22.13లక్షలు మంజూరు కావడంతో బాధిత కుటుంబీకులకు మంగళవారం చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా ఛైర్మన్‌ మనోహర్‌రెడ్డి, ఎంపీపీలు అరవింద్‌రావు, సత్యమ్మ, మల్లేశం, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

పూడూరు : కండ్లపల్లికి చెందిన చేవెళ్ల నారాయణ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 1.25 లక్షల చెక్కును ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ శ్రీశైలంగౌడ్‌ నాయకులు సదానందంగౌడ్‌, బాలయ్య, మల్లేశం తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని