అమ్మకు బోనం.. భక్తజన సందోహం
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

అమ్మకు బోనం.. భక్తజన సందోహం


లగచర్లలో కళాకారుల విన్యాసాలు

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: మున్సిపల్‌ పరిధిలోని ఎన్నెపల్లి, రామయ్యగూడ కాలనీల్లో బోనాల పండుగను జరుపుకొన్నారు. బోనాలు నెత్తిన ఎత్తుకొని పోచమ్మ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్‌ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

గోనూరు (తాండూరుగ్రామీణ): గోనూరులో గ్రామదేవతలు బోనమ్మ, మైసమ్మలకు మహిళలు బోనాలతో ప్రదర్శనగా వెళ్లి పిండివంటలతో నైవేద్యాలు సమర్పించారు. సర్పంచి గోవిందు, ఉపసర్పంచి నసీమాబేగం ఆలయాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు.


బోనాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్‌

తాండూరుగ్రామీణ: మల్కాపూర్‌, ఐనెల్లిలో మంగళవారం పోచమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించారు. మహిళలు వేప ఆకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలను నెత్తిన బెట్టుకొని ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు. డప్పు, డోలు వాయిద్యాల నడుమ అమ్మవారి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సర్పంచి స్వప్నజ్యోతి, ఉపసర్పంచులు వెంకటయ్యగౌడ్‌, హస్సన్‌పటేల్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు అంబమ్మ పాల్గొన్నారు.

పెద్దేముల్‌: జనగాం గ్రామంలో మంగళవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఊరడమ్మ, మైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఊరేగుతూ.. అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి రుక్మిణమ్మ, ఉప సర్పంచి పార్వతమ్మ పాల్గొన్నారు.

కొడంగల్‌: అషాఢమాసం సందర్భంగా మంగళవారం భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామదేవతలకు సమర్పించారు. భక్తి ప్రపత్తులతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

బొంరాస్‌పేట: లగచర్లలో బోనాలతో గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించారు. కళాకారులు వివిధ వేషధారణలతో విన్యాసాలు చేశారు.

పూడూరు: కడ్మూరులో ఆషాడ బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం ఉరేగింపు ప్రారంభమవుతుందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని