మదిలో అమ్మ తలంపు.. మహిళల ఊరేగింపు
eenadu telugu news
Updated : 04/08/2021 11:25 IST

మదిలో అమ్మ తలంపు.. మహిళల ఊరేగింపు

- న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌

పట్టణ వ్యాప్తంగా మంగళవారం ఆశాఢ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. వాల్మీకినగర్‌లోని అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. సాయిపూరు, గాంధీనగర్‌, రాజీవ్‌ గృహకల్ప అమ్మవారి ఆలయాల వద్ద ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పుల దరువులతో ఆలయాల చుట్టూ ప్రదర్శనలు నిర్వహించి మహిళలు మొక్కులు సమర్పించారు. ఆయా ఆలయాల వద్ద నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు దీప, కౌన్సిలర్లు సంగీత, నీరజ పూజలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని