తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో పోలీసుల సోదాలు
eenadu telugu news
Updated : 04/08/2021 10:31 IST

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో పోలీసుల సోదాలు

బోడుప్పల్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై ఓ యువతి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహోద్యోగి, స్నేహితుడైన చిలక ప్రవీణ్‌ గత కొంతకాలంగా తీన్మార్‌ మల్లన్న అవినీతి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడలోని తీన్మార్‌ మల్లన్న యూట్యూబ్‌ ఛానల్‌పై పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఒక్కొక్కరుగా కార్యాలయానికి చేరుకున్న పోలీసులు కార్యాలయ సిబ్బందిని బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు పరిశీలించి, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని