గంగాప్రసాద్‌ బిర్లా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

గంగాప్రసాద్‌ బిర్లా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం


నీడకు సంబంధించి గొట్టాల ద్వారా ప్రయోగం చేసి చూపుతున్న కె.జి.కుమార్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ అగ్రగామిగా ఎదిగిందని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ అండ్‌ ప్లానిటోరియం సంచాలకులు కె.జి.కుమార్‌ అన్నారు. మంగళవారం గంగాప్రసాద్‌ (జీపీ) బిర్లా శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బీఎం ప్లానిటోరియంలో ‘మార్స్‌-1001’ సరికొత్త షోను నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) (ఇస్రో) సంచాలకులు డా.రాజ్‌కుమార్‌ శుభారంభాన్ని పలికారు. అనంతరం కె.జి.కుమార్‌ మాట్లాడుతూ.. శతజయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా జరుపుతామన్నారు. సినిమా తరహాలో ‘మార్స్‌-1001’ ప్రదర్శనను వీక్షిస్తున్నంత సేపు మనమంతా అంగారకుడిపైకి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జీపీ బిర్లా ఆర్కియాలజికల్‌ అస్రోనోమికల్‌ అండ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (జీపీబీఏఏఎస్‌ఆర్‌ఐ) అధ్యక్షురాలు నిర్మలా బిర్లా, కార్యదర్శి సునంద ఉన్నారు.

‘నీడ’ మాయమైంది!

‘‘మంగళవారం మధ్యాహ్నం ‘నీడ’ మాయమైంది’’. ఇది చదివిన వారందరికీ ఆశ్చర్యం కలుగకమానదు. కానీ ఇది నిజం. సాధారణంగా మనం నిలబడినప్పుడు.. నడుస్తున్నప్పుడు ఏదో ఒకవైపు నీడ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సూర్యుడి గమనాన్ని బట్టి దాని దిశ మారుతూ ఉంటుంది. అయితే మంగళవారం మధ్యాహ్నం 12:22 గంటలకు నీడ అటూ.. ఇటూ కాకుండా నిటారుగా పడింది. దీన్నే ‘జీరో షాడో డే’గా పిలుస్తారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని