TS News: నీళ్లు అవే.. ధర మారుతోంది!.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఎమ్మార్పీకి మించి అమ్మకం
eenadu telugu news
Updated : 04/08/2021 12:33 IST

TS News: నీళ్లు అవే.. ధర మారుతోంది!.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఎమ్మార్పీకి మించి అమ్మకం

వీధి చివర ఉండే చిన్న కిరాణాకొట్టులో ఓ ప్రముఖ బ్రాండ్‌ నీళ్ల సీసా లీటర్‌ ధర రూ.20 ఉంటే.. పక్కనే ఉండే రెస్టారెంట్‌లో రూ.40 ఉంటోంది. అదే ప్రముఖ హోటలైతే.. ఏకంగా 8 రెట్లు అధికంగా రూ.150 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రాంతానికో ధరతో వినియోగదారుడిని దోపిడీ చేస్తున్నారు.

మారని తీరు..

లీగల్‌ మెట్రోలజీ అధికారులు దాడులు చేస్తున్నా, వినియోగదారుల కమిషన్‌ జరిమానాలు విధిస్తున్నా.. రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ తీరులో మార్పు కనిపించడం లేదు. సామాజిక కార్యకర్త ఫిర్యాదు ఆధారంగా.. రూ.25ల శీతల పానీయాన్ని రూ.40 అమ్మినందుకు నిజాంపేట్‌లోని పిస్తాహౌజ్‌ రెస్టారెంట్‌, రూ.12 సోడా బాటిల్‌పై రూ.30 వసూలు చేసిన కూకట్‌పల్లి సంగీత రెస్టారెంట్‌ అండ్‌ బార్‌, రూ.25 శీతల పానీయానికి రూ.35 వసూలు చేసిన మియాపూర్‌లోని హోటల్‌ కూచిపూడి పలావ్‌ రెస్టారెంట్‌పై అధికారులు గతంలో దాడి చేసి కేసులు నమోదు చేశారు. జిల్లా వినియోగదారుల కమిషన్‌ సైతం ఈ తరహా కేసుల్లో జరిమానాలు విధించింది. నీళ్ల సీసాపై ఎమ్మార్పీకి మించి రూ.10 అదనంగా వసూలు చేసిన మెరిడియన్‌ హోటల్‌కి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ రూ.20 వేల జరిమానా విధిస్తూ ఇటీవలే తీర్పు వెలువరించింది.

ఫిర్యాదు ఇలా..

ధరల దోపిడీపై లీగల్‌ మెట్రాలజీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేయాలనుకుంటే clmts@nic.in, కి లేదా 040-2761 3667 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్ఛు న్యాయపరంగా పోరాడాలనుకుంటే, సంబంధిత సాక్ష్యాధారాలను సేకరించి నాంపల్లిలో గగన్‌విహార్‌లోని జిల్లా వినియోగదారుల కమిషన్‌లో నేరుగా ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్ఛు


సుప్రీం తీర్పు చూపుతూ..

కోర్టు తీర్పుల పూర్తి సారాంశాన్ని చెప్పకుండా, వాటిని తమకు అనుకూలంగా మార్చుకొంటూ కొన్ని రెస్టారెంట్లు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. న్యాయపరంగా ఈ కేసులను ఎదుర్కొంటున్న సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నామని వివరణ ఇస్తున్నాయి. మహ్మద్‌ మోసిన్‌ వర్సెస్‌ మెరిడియన్‌ రెస్టారెంట్‌ కేసులో ప్రతివాదులు సుప్రీం కోర్టు రూలింగ్‌ను చూపిస్తూ వాదనలు వినిపించారు. ఆ సమయంలో జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 బెంచ్‌ సభ్యుడు పారుపల్లి జవహర్‌బాబు దీనికి సంబంధించి పూర్తి వివరణ అందించారు. సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం తయారీ సంస్థ నుంచి ఉత్పత్తులు నేరుగా కొనుగోలు చేసే ఇస్టిట్యూషనల్‌, ఇండస్ట్రియల్‌ కొనుగోలుదారుల మాత్రమే ఎమ్మార్పీకి మించి వసూలు చేయొచ్చని వివరించారు. ఇన్‌స్టిట్యూషనల్‌ లేదా ఇండస్ట్రియల్‌ కొనుగోలుదారులా అన్న విషయం నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. చివరికి వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు వెలువడింది.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని