భాగ్యనగర చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

భాగ్యనగర చిత్ర వార్తలు

కల కనొద్ధు.. ఇది చిలకలగూడ

రాత్రి అయింది రద్దీ ఉండదు రహదారిపై రయ్‌మంటూ దూసుకెళ్దామనుకుంటే అక్కడ కుదరదు. సికింద్రాబాద్‌ చిలకలగూడ చౌరస్తా వద్ద సూచికలు లేక పోవడంతో ఏ వాహనం ఎలా వస్తుందో తెలియదు. రాత్రి కావడంతో ట్రాఫిక్‌ నియంత్రించే సిబ్బంది ఉండరు. దీంతో వాహనదారులందరూ ఇష్టారాజ్యంగా దూసుకొస్తుండడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. మంగళవారం రాత్రి నాటి చిత్రమిది.


అప్రమత్తతే శ్రీరామ రక్ష

రోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూ పార్కు సందర్శనకు వచ్చిన ఓ యువతి తనతో పాటు బిడ్డకూ మాస్క్‌ ధరింపచేసి పర్యటిస్తూ కనిపించారిలా..


చారిత్రక సోయగం..నిర్వహణ లేక అధ్వానం

నాలుగు వందలకు పైగా ఏళ్ల చరిత్ర చార్మినార్‌ సొంతం. నిత్యం వేలాది మంది సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ నిర్వహణ కరవై కట్టడాలు శిథిలం అవుతున్నాయి. సుందరీకరణ పనుల్లో వేగం పెరగపోవడమే ఇందుకు కారణం.


విధి వక్రీకరించి.. పాదబాటపై విశ్రమించి..

తని పేరు అంకాల చంద్రయ్య. వయస్సు 45. సంగారెడ్డి జిల్లావాసి. భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. బతుకుదెరువు కోసం ఖైరతాబాద్‌లో ఓ హోటల్‌లో పనికి కుదిరారు. రెండు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. యజమాని పనిలోంచి తొలగించాడు. దీంతో రోడ్డున పడ్డ ఆయన ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నివాసం లేక లక్డీకాపూల్‌లో పాదబాటపైనే సేద తీరుతూ కనిపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని