Cyberabad Police: ఒక్క చలానా ఉన్నా సీజ్‌
eenadu telugu news
Updated : 04/08/2021 11:20 IST

Cyberabad Police: ఒక్క చలానా ఉన్నా సీజ్‌

సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఒక్క ట్రాఫిక్‌ చలానా పెండింగ్‌లో ఉన్నా.. ఆ వాహనాన్ని సీజ్‌ చేయాలని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. గతంలో మూడు చలానాలు పెండింగ్‌లో ఉంటే సీజ్‌ చేసేవారు. గతేడాది సైబరాబాద్‌ పరిధిలో 47.83 లక్షల కేసుల్ని నమోదు చేసి.. రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. ఉల్లంఘనులు రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారు. దీంతో సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు కట్టిస్తున్నారు. లేదంటే వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని