కొత్త దవాఖానాలతో ఆరోగ్య భాగ్యం
eenadu telugu news
Published : 04/08/2021 02:24 IST

కొత్త దవాఖానాలతో ఆరోగ్య భాగ్యం

రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

 
ఛాతీ ఆసుపత్రిని సందర్శించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

అమీర్‌పేట, బొల్లారం, చైతన్యపురి: మహానగరంలో మరింత మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పలువురు మంత్రులు, అధికారులతో కలిసి రాజధానిలో కొత్తగా నిర్మించనున్న మూడు ప్రభుత్వ ఆస్పత్రుల స్థలాలను మంత్రి వేముల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానగరంలో 20 లక్షల జనాభా ఉన్న సమయంలో ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో దీనిపై దృష్టిసారించలేదు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గచ్చిబౌలి టిమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు మరో మూడు కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. దీనికి అనుగుణంగా చెస్టు ఆస్పత్రిలో, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌, అల్వాల్‌లోనూ స్థలాలను పరిశీలించామన్నారు. మూడు సూపర్‌ స్పెష్టాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్రమంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సాయన్న డీఎంఈ డాక్టర్‌ రమేష్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ ఐ.గణపతిరెడ్డి, కలెక్టర్‌ శ్వేతామహంతితోపాటు అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని