అధిక దిగుబడులపై శిక్షణ
eenadu telugu news
Published : 06/08/2021 00:46 IST

అధిక దిగుబడులపై శిక్షణ

నీటిని అందించే తీరును వివరిస్తున్న అధికారులు

పూడూరు, న్యూస్‌టుడే: పంటల సాగులో నీటియాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాలంతరీ ఆధ్వర్యంలో గురువారం పెద్దఉమ్మెంతాల్‌లో రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచి శ్రీధర్‌గుప్తా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేల స్వభావం, నీటిని వాడే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. రెయిన్‌ గన్‌ ద్వారా నీటిని అందించే తీరును చూపించారు. వాలంతరీ డైరెక్టర్‌ కృష్ణారావు మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న పద్ధతులను అమలు చేయాలని కార్యక్రమంలో నిపుణులు రమణారెడ్డి, ఏడీఏలు వీరప్ప, సచిన్‌దత్తా, సునీత, ఏఓ సామ్రాట్‌రెడ్డి,  అధికారిణి సంతోషిణి, ఏఈఓ శిరీష ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని