విరిగిన కరెంటు కొక్కెం
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

విరిగిన కరెంటు కొక్కెం

రెండున్నర గంటలు రైలు ప్రయాణికులకు నరకం


నిలిచిపోయిన సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు కూత వేటు దూరంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఆగిపోవడంతో ప్రయాణికులు రెండున్నర గంటల పాటు ఇబ్బందులు పడ్డారు. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వస్తున్న ఈ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరువకు రాగానే ఇంజిన్‌కు పైన కరెంటు సరఫరా చేసే కొక్కెం (పెంటోగ్రాఫ్‌) విరిగిపోయింది.. సికింద్రాబాద్‌కు సాయంత్రం 6.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా.. 6.15 గంటలకు నిలిచిపోయింది. మరో ఇంజిన్‌ పంపించి నిమిషాల్లో రైలును అక్కడి నుంచి గమ్యస్థానం చేర్చే అవకాశం ఉన్నా.. రైల్వే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. వరుసగా నాలుగు రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు రెండున్నర గంటలు ఇబ్బంది పడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని