పర్యాటకమే దేశానికి ప్రధాన ఆర్థిక వనరు
eenadu telugu news
Updated : 06/08/2021 05:30 IST

పర్యాటకమే దేశానికి ప్రధాన ఆర్థిక వనరు

ఫిక్కీ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పర్యాటకమంటే విరామ సమయమో, కొద్దిసేపు ఆస్వాదించే ఆనందం మాత్రమే కాదని.. ఇదే ఈ దేశానికి ప్రధాన ఆర్థిక వనరు అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం మూల స్తంభంగా ఉండటంతో పాటు ఉపాధి కల్పనలోనూ కీలకంగా ఉందని పేర్కొన్నారు. గురువారం ఆన్‌లైన్‌ వేదికగా ఫిక్కీ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. 2019లో ఈ రంగం ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిందని, దాదాపు 4కోట్ల ఉద్యోగాలొచ్చాయని ఆయన తెలిపారు. దేశంలోని మొత్తం ఉపాధిలో 12 శాతం ఈ రంగం ద్వారా కల్పించిందే అన్నారు. పర్యాటక రంగ వ్యాపారులు, యంత్రాంగం మొత్తాన్ని ఓ కుటుంబంలా కలుపుకొని ఈ రంగానికి పూర్వ వైభవాన్ని త్వరలోనే తీసుకొస్తామని మంత్రి వివరించారు. ఫిక్కీ కార్యదర్శి దిలీప్‌ చెనోయ్‌, ఫిక్కీ పర్యాటక విభాగం ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ జ్యోత్స్న సూరి, సహ ఛైర్మన్లు దీపక్‌ దేవ, జేకే మహంతి, నవీన్‌ కుందుతో పాటు పలువుర పర్యాటక శాఖ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని