పులియబెట్టిన ఆహార పదార్థాలతో మేలు
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

పులియబెట్టిన ఆహార పదార్థాలతో మేలు


ఉస్మానియాలోని మైక్రోబియల్‌ అండ్‌ ఫెర్మేంటేషన్‌ టెక్నాలజీ సెంటర్‌లో పరిశోధన చేస్తున్న బృందం

ఈనాడు, హైదరాబాద్‌: పులియబెట్టిన ఆహార పదార్థాలలో క్యాన్సర్‌ను నియంత్రించే బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. టమాటా పచ్చడి, మజ్జిగలో మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అధికంగా ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. ఓయూ మైక్రో బయోలజీ విభాగంలోని మైక్రోబియల్‌ అండ్‌ ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ సెంటర్‌ సంచాలకుడు ప్రొ.భూక్యా భీమా ఆధ్వర్యంలోని పరిశోధక బృందం పులియబెట్టిన ఇడ్లీ, దోశ పిండి, పెరుగు, మజ్జిగ, పచ్చళ్లు వంటి ఆహార పదార్థాల నుంచి ప్రోబయోటిక్‌ ఈస్ట్‌ అనే బ్యాక్టీరియాను వేరు చేసే ఉద్దేశంతో పరిశోధన చేపట్టారు. వీటిల్లో మనిషికి మేలు చేసే దాదాపు 5 రకాలైన బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. యాంటీ క్యాన్సర్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్నాయని గుర్తించారు. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

*● టమాటా పచ్చడిలో యాంటీ క్యాన్సర్‌ కారకాలున్నట్లు తేల్చారు. ఇందులో ఉండే పెడియోకోకస్‌ యాసిడిలాక్టిసీ అనే మేలు చేసే బ్యాక్టీరియాతో పెద్దపేగు క్యాన్సర్‌ రాకుండా కణాలను నియంత్రిస్తుంది.

*● మజ్జిగలో 30 రకాల ప్రోబయోటిక్‌ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో పెడియోకోకస్‌ పెంటోసాసిస్‌ అనే బ్యాక్టీరియాతో మనిషి పేగులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికి యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ క్యాన్సర్‌ గుణాలతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్థ్యమూ ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని