ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ బుకీ అరెస్టు
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ బుకీ అరెస్టు

షేక్‌ సాధిఖ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ (టెస్ట్‌ మ్యాచ్‌).. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ (టీ-20 మ్యాచ్‌) మ్యాచ్‌లకు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న బుకీని సరూర్‌నగర్‌లో రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. రూ.15.7లక్షల నగదు, 4 చరవాణులు, 8 క్రెడిట్‌ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు, అతడి బంధువులకు చెందిన 9 బ్యాంకు ఖాతాల్లోని రూ.69.63 లక్షలను స్తంభింపజేశారు. డీసీపీ(ఎస్వోటీ) సురేందర్‌రెడ్డితో కలిసి రాచకొండ సీపీ మహేష్‌ ఎం.భగవత్‌ గురువారం వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన షేక్‌ సాధిఖ్‌(25) అయిదేళ్ల కిందట నగరానికి వలస వచ్చాడు. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పాల్గొనేవాడు. యూబీ యూఏఈ బెట్‌, 8టీం, ఎంబీ మ్యాక్స్‌ ఇన్‌ప్లే బెట్‌ తదితర వెబ్‌సైట్లు, యాప్‌లకు రూ.10వేలు చొప్పున చెల్లించి ఐడీ, పాస్‌వర్డ్‌ తీసుకునేవాడు. క్రికెట్‌ మ్యాచ్‌లు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన లింక్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేవాడు. మ్యాచ్‌ ముగియగానే సాధిఖ్‌.. తన 30 శాతం కమిషన్‌ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని పంటర్ల ఖాతాలో జమ చేసేవాడు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎల్బీనగర్‌ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ టి.రవికుమార్‌ను సీపీ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని