బిహార్‌కు రండి.. పెట్టుబడులు పెట్టండి
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

బిహార్‌కు రండి.. పెట్టుబడులు పెట్టండి


మాట్లాడుతున్న కేంద్ర మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌, చిత్రంలో ఖ్యాతి నారవాణె, భాస్కర్‌రెడ్డి, అనీల్‌ అగర్వాల్‌

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: బిహార్‌ అంటే మాఫియా డాన్‌లు ఉండే ప్రాంతంగా ముద్ర పడిపోయింది. తమ రాష్ట్రాన్ని అర్థం చేసుకోవాలంటే ‘సూపర్‌ 30’ సినిమా చూడాలన్నారు బిహార్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి షా నవాజ్‌ హుస్సేన్‌ స్పష్టం చేశారు. అపోహలు, భయాలు వీడి మా రాష్ట్రానికి రండి. పెట్టుబడులు పెట్టండి. ఎవరైతే రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెడతారో.. వారిని మా రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి స్వయంగా వచ్చి ఘనస్వాగతం పలుకుతారని అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో బిహార్‌ రాష్ట్రంలో వ్యాపారం, పెట్టుబడి అవకాశాలపై మంత్రి షా నవాజ్‌ హుస్సేన్‌తో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు కె.భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మా దగ్గర పెట్టుబడులు పెట్టడానికి వస్తే.. వారం రోజుల్లో అన్ని రకాల అనుమతులిస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ సీనియర్‌ ఉపాధ్యక్షులు అనీల్‌ అగర్వాల్‌, సీఈఓ ఖ్యాతి నారావణెలు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని