త్వరలో స్థాయి సంఘం నోటిఫికేషన్‌
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

త్వరలో స్థాయి సంఘం నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ కార్పొరేషన్‌లో స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు రాష్ట్ర పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది. గతంలో మాదిరి 15 మంది సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఆమేరకు వారం నుంచి పది రోజుల్లో ప్రకటన విడుదల చేయనున్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు.

పెరగనున్న కో-ఆప్షన్‌ సభ్యులు

జీహెచ్‌ఎంసీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకూ అధికారులు సిద్ధమవుతున్నారు. గత పాలకమండలి సమయంలో ఆరుగురు కో-ఆప్షన్‌ సభ్యులు ఉండేవారు. ఈదఫా ఈ సంఖ్యను పురపాలక శాఖ పదికి పెంచనుందని సమాచారం. భాజపా కార్పొరేటర్లకూ కో-ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం దక్కే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 150 మంది సభ్యులున్న పాలకమండలిలో ప్రస్తుతం తెరాసకు 56 మంది కార్పొరేటర్లు, భాజపాకు 47, ఎంఐఎంకు 44, కాంగ్రెస్‌కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు.

ఎన్నిక జాప్యంతో సమస్యలు

జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి ఫిబ్రవరి 11వ తేదీ కొలువుదీరింది. నిబంధనల ప్రకారం మూడు నెలల్లోపు స్థాయీ సంఘం ఎన్నికలు జరగాలి. సర్కారు నుంచి సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో ఎన్నిక నిర్వహణలో జాప్యం జరిగింది. దీని ప్రభావం వల్ల సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు స్థాయి సంఘం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంజినీరింగ్‌, భూసేకరణ, నాలాలు లాంటి పనులు అందులో ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని