నటి నిహారిక భర్త అద్దె ఇంటి గొడవ రాజీ
eenadu telugu news
Updated : 06/08/2021 12:20 IST

నటి నిహారిక భర్త అద్దె ఇంటి గొడవ రాజీ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక భర్త అద్దెకు తీసుకున్న ఇంటి వివాదంలో రాజీ కుదిరింది. తొలుత అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ వారు బంజారాహిల్స్‌ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అసోసియేషన్‌కు చెందిన కొందరు తమ ఫ్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని నిహారిక భర్త చైతన్య పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. షేక్‌పేట ప్రాంతంలో ఉన్న టాన్సికా అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ను గతేడాది మార్చిలో నిహారిక అద్దెకు తీసుకున్నారు. ఫ్లాట్‌ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారని, తద్వారా చాలామంది వచ్చి వెళుతున్నారని, కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వీరు వ్యవహరిస్తున్నారని టాన్సికా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు గురువారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము అద్దెకు తీసుకున్న సమయంలోనే ఇంటి యజమానికి ప్రొడక్షన్‌ కార్యాలయం విషయం తెలియజేశామంటూ నిహారిక భర్త చైతన్య విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 2న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దాదాపు 20 నుంచి 25 మంది అసోసియేషన్‌కు చెందిన వారు తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. ఈ వివాదంపై ఇంతవరకు ఎలాంటి కేసులూ నమోదు చేయలేదని బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివచంద్ర చెప్పారు. ఈ నేపథ్యంలో తమ మధ్య రాజీ కుదిరిందని చైతన్య తాజాగా ఒక వీడియోలో తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని