అట్టపెట్టెలో అక్షరవిందు!
eenadu telugu news
Published : 06/08/2021 02:05 IST

అట్టపెట్టెలో అక్షరవిందు!

ఈనాడు, హైదరాబాద్‌

పుస్తకం దారిచూపే నేస్తం. అలసిన మనసుకు సేదతీర్చే ఉపశమన మార్గం. పుస్తక మార్కెట్‌కు డిమాండ్‌ ఉన్న నగరంలో ఈ నెల 12-15 వ తేదీ వరకూ పంజాగుట్ట మెట్రోస్టేషన్‌ లెవల్‌ 1 ఎక్స్‌పో గ్యాలరీలో పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ తదితర భాషలకు చెందిన 2 లక్షల పుస్తకాలు ప్రదర్శనలో ఉంటాయని కితాబ్‌ లవర్స్‌ సంస్థ డైరెక్టర్‌ హరిప్రీత్‌ చావ్లా తెలిపారు.

ఏమిటీ ప్రత్యేకత

దిల్లీకి చెందిన స్నేహితుల బృందం ఏటా సూరత్‌, అహ్మదాబాద్‌, దిల్లీ, పాట్నా, జైపూర్‌, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ‘లోడ్‌ ది బాక్స్‌’ పేరుతో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ రచయితల రచనలను సేకరించి ప్రదర్శనలో ఉంచటమే దీని ప్రత్యేకత. పసిపిల్లల నుంచి వయోధికుల వరకూ అన్నివర్గాలకు ఇష్టమైన పుస్తకాలు లభిస్తాయన్నారు. చిన్న, మధ్యతరహా, పెద్దఅట్టపెట్టెలను మూడు విభాగాలుగా మార్చి వాటిలో 10-13, 17-20, 30-33 పుస్తకాల వరకూ ఉంచి నిర్ణయించిన ధరకు విక్రయిస్తామని హరిప్రీత్‌ చావ్లా తెలిపారు. ఫిక్షన్‌, నాన్‌-ఫిక్షన్‌, సైన్స్‌, టెక్నాలజీ, మెడికల్‌ థ్రిల్లర్‌, రొమాన్స్‌ నవలలు, డిటెక్టివ్‌, సస్పెన్స్‌, కామిక్స్‌, జీవితచరిత్రలు తదితర రచనలు ఉంటాయన్నారు.

పుస్తక ప్రదర్శన: లోడ్‌ ది బాక్స్‌

ప్రదేశం: పంజాగుట్ట మెట్రోస్టేషన్‌ లెవల్‌ 1

సమయం: ఈ నెల 12-15వ తేదీ ఉదయం 10నుంచి రాత్రి 9 గంటలు

ప్రవేశం: ఉచితం

వివరాలకు: 88605 25525


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని