వివాహమైన 10 నెలలకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణం
eenadu telugu news
Updated : 05/09/2021 06:24 IST

వివాహమైన 10 నెలలకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణం


ప్రియాంక

మూసాపేట, న్యూస్‌టుడే: ఊరెళ్లే విషయంలో దంపతుల మధ్య నెలకొన్న వివాదం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి దారితీసింది. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన బ్రహ్మానందం, రాజమణి కుటుంబం కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఉంటోంది. వీరి కుమార్తె ప్రియాంక(28)కు హన్మకొండకు చెందిన మందుగుల అన్వేష్‌తో గతేడాది నవంబరు లో పెళ్లి చేశారు. కూకట్‌పల్లి స్వాన్‌లేక్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ చేస్తున్నారు. చిన్నచిన్న తగాదాలు పడుతుండేవారు. శుక్రవారం భార్యను హన్మకొండకు రావాల్సిందిగా అన్వేష్‌ కోరాడు. ఆమె రాననడంతో వాగ్వాదం జరిగింది. తర్వాత చేరో గదిలో నిద్రపోయారు. ఉదయం లేచిచూసేసరికి ప్రియాంక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక తండ్రి ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని