సైదాబాద్‌ ఘటన: నిందితుడిని తప్పించేందుకు స్నేహితుడి సహకారం!
eenadu telugu news
Updated : 14/09/2021 06:58 IST

సైదాబాద్‌ ఘటన: నిందితుడిని తప్పించేందుకు స్నేహితుడి సహకారం!

సైదాబాద్‌ హత్యాచారం కేసులో వీడని చిక్కుముడి

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, సైదాబాద్‌

నగరంలో ఆరేళ్ల చిన్నారి పాశవిక హత్యాచార ఘటనపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామంటూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై పోలీసులను ప్రశ్నిస్తుండగా.. పోలీసులు మాత్రం రాజు ఆచూకీ ఇంకా లభించలేదని, పది బృందాలతో గాలిస్తున్నామంటున్నారు.  

పారిపోవాలంటూ.. 
తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు... నాలుగు రోజుల క్రితం చాక్లెట్‌ ఆశ చూపించి బాలికను తీసుకెళ్లాడు. పాశవికంగా చిన్నారిని హత్యచేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది. అక్కడున్నవారు వెంటనే గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, తువ్వాలు, ఒక జత దుస్తులతో కూడిన సంచిని ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు బలం చేకూర్చుతూ అక్కడున్న సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. మరోవైపు నిందితుడు రాజు గంజాయి పీల్చడంతో పాటు గుడుంబా ఎక్కువగా తాగుతుంటాడని,  ఎక్కడపడితే అక్కడ పడిపోతాడని పోలీసులు చెబుతున్నారు. అతడి వద్ద చరవాణి లేకపోవడంతో ఎక్కడున్నాడో తెలుసుకోవడం కష్టంగా మారిందని వివరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, శాస్త్రీయ ఆధారాలతో పరిశోధిస్తున్నామంటున్నారు.  ఫుటేజిలో ఉన్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయంగా తెలిసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని