వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా

రుణం సకాలంలో చెల్లిస్తే మరింత తోడ్పాటు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ

రోనాతో నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించటంతో వీధి వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. గత ఏడాది నుంచి రుణాలు ఇచ్చి వారు కోలుకునేలా చేయడమే లక్ష్యం. మరో అడుగు మందుకు వేసి గతంలో తీనుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి రెండింతలు మంజూరు చేయాలని నిర్ణయించారు. తోపుడు బండ్లపై, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లో పురపాలికల్లో వీధి వ్యాపారులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. వీరికి తోడ్పాటు అందించాలని రుణాలు మంజూరు చేశారు. ఇందుకోసం ముందుగా వీధి వ్యాపారుల వివరాలను మెప్మా సిబ్బంది సేకరించి అర్హులను గుర్తించారు. వీరికి రుణం అందించేందుకు బ్యాంకర్లకు సిఫారసు చేశారు. ఇలా మొదటి విడత 6,634 మందికి రుణాలు పంపిణీ చేశారు. హామీ పత్రాలు లేకుండా కేవలం గుర్తింపు కార్డు అర్హతతో వ్యక్తిగత ఖాతాకు రూ.10 వేలు జమ చేశారు. ఏడాదిలో తిరిగి చెల్లించాలని వారికి సూచించారు. అనంతరం పథకంలో మార్పు చేసి, సకాలంలో చెల్లించిన వారికి వెంటనే రూ.20 వేలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది తీసుకున్న వారు చాలా మంది రెండో విడత కరోనా ప్రభావంతో వ్యాపారాలు సాగక చెల్లించలేకపోయారు. ఇపుడిపుడే ఆర్థికంగా కుదురుకుంటున్నారు. పూర్తి స్థాయిలో చెల్లించి సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు జనాభాలో 5 శాతం వీధి వ్యాపారులను గుర్తించాలి. రోడ్ల పక్కన తాత్కాలిక షెడ్లు వేసుకుని వ్యాపారాలు నిర్వహించే వారిని పరిగణనలోకి తీసుకున్నారు.

వీధి విక్రయదారులకు అవగాహన


తక్కువ సంఖ్యలో ఉన్నారు

- రవికుమార్‌, మెప్మా జిల్లా అధికారి, వికారాబాద్‌

వీధి వ్యాపారులకు రూ.10వేల చొప్పున రుణం అందించాం. మొదటి విడత తీసుకున్న వారు నెల నెలా కిస్తులు చెల్లించాలి. వీరికి రెండో విడత మంజూరు చేస్తాం. రెండో విడత పొందేందుకు అర్హత సాధించిన వారు పురపాలికల్లో 20 నుంచి 30 మంది మాత్రమే ఉన్నారు. వీరికి సంబంధించిన పత్రాలను బ్యాంకులకు పంపించాం. వీరికి రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అక్టోబరు చివరి నాటికి వీరి సంఖ్య పెరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని