పౌష్టికాహారంపై అవగాహన తప్పనిసరి
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

పౌష్టికాహారంపై అవగాహన తప్పనిసరి


సమావేశంలో మాట్లాడుతున్న అదనపు పాలానాధికారి చంద్రయ్య

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు పాలనాధికారి చంద్రయ్య సూచించారు. బుధవారం జిల్లా పాలనాధికారి కార్యాలయ సమావేశ మందిరలో పోషణ అభియాన్‌ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఈనెల 1 నుంచి 30 వరకు నిర్వహించే పోషణ అభియాన్‌ మాసోత్సవాల్లో రక్తహీనత, పౌష్టిక ఆహార లోపం, తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ప్రతి కేంద్రానికి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయాలన్నారు. మహిళా, శిశు సంక్షేమాధికారిణి లలితకుమారి మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు, చిన్నారుల్లో పోషక లోపం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎస్‌సీడీవో మల్లేశం, ప్రోగాం అధికారిణి డాక్టర్‌ లలిత, సీడీపీఓలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని