వైద్య కళాశాలకు 30 ఎకరాల భూమి!
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

వైద్య కళాశాలకు 30 ఎకరాల భూమి!


ఆలంపల్లి రెవెన్యూ పరిధిలోని భూములు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: వికారాబాద్‌లో వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వచ్చే ఏడాది వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నామని ప్రకటించారు. దీంతో జిల్లాలో అధికారులు భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా కేంద్రమైన వికారాబాద్‌లో 30 ఎకరాల ప్రభుత్వ భూముల లభ్యతపై ఆరా తీస్తున్నారు. ఆలంపల్లి రెవెన్యూ పరిధిలో బిళ్ల దాఖలు కింద 160 ఎకరాల భూములున్నాయి. ఇందులో 30 ఎకరాలను వైద్య కళాశాలకు ప్రతిపాదిస్తూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వైద్య కళాశాల వికారాబాద్‌లోనే ఏర్పాటవుతుందనేది స్పష్టమవుతోంది. జిల్లా ఆసుపత్రి తాండూరులో ఉండటంతో వైద్య కళాశాల సైతం అక్కడే వస్తుందని అంతా అనుకున్నారు. జిల్లా కేంద్రంలోనే వైద్య కళాశాల ఉండాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని