రెండు వారాల్లో వంద శాతం టీకా పంపిణీ: కలెక్టర్‌
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

రెండు వారాల్లో వంద శాతం టీకా పంపిణీ: కలెక్టర్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా రెండు వారాల్లో కొవిడ్‌ టీకా పంపిణీని వంద శాతం పూర్తి చేస్తామని జిల్లా పాలనాధికారిణి నిఖిల అన్నారు. బుధవారం పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి దయాకర్‌రావు దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా పాలనాధికారుల సమావేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1,51,600 మందికి మొదటి విడత, 42 వేల మందికి రెండో విడత టీకా వేశామని తెలిపారు. మిగిలిన వారికి రెండు వారాల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గురువారం నుంచి గ్రామాలు, వార్డుల వారీగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటామని వెల్లడించారు. అదనపు పాలానాధికారి చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్‌, కమిషనర్‌ శరత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని