అల్ప సంఖ్యాకుల అభ్యర్థులకు ఉచిత శిక్షణ
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

అల్ప సంఖ్యాకుల అభ్యర్థులకు ఉచిత శిక్షణ

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: అల్ప సంఖ్యాకుల అభ్యర్థులకు యూపీఎస్‌సీ-సి శాట్‌ 2022 పరీక్షకు మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిణి సుధారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటిసారి ప్రవేశం పొందే వారు ఈనెల 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రవేశం మెరిట్‌ ప్రాతిపదికన ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు చరవాణి నంబరు 79933 57103లో సంప్రదించాలని సూచించారు.


ఇంటర్‌ ప్రవేశాలకు 30 వరకు గడువు

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని జిల్లా నోడల్‌ అధికారి శంకర్‌నాయక్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని