కోర్టు ఆదేశాల మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

కోర్టు ఆదేశాల మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు

కుల్కచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: తప్పుడు పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారనే ఆరోపణతో కోర్టు ఆదేశాల మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు కుల్కచర్ల ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన అవుసుల బుచ్చయ్యకు గ్రామంలోని సర్వే నం.350 నుంచి 355 వరకు 6.29 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ నగరంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుచ్చయ్యకు చెందిన భూమి నుంచి ఎకరం ఎనిమిది గుంటల భూమిని విక్రయించాలని ఆయన మనవడు అనిల్‌ను కోరగా తన పేరుపై పట్టాలేదని వివరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా జనవరి 2000లో అవుసుల బుచ్చయ్య భూమి తన మనవడు అనిల్‌కు చెందుతుందని శ్రీనివాస్‌గౌడ్‌ నకిలీ వీలునామా పత్రాన్ని సృష్టించాడన్నారు. దీని ఆధారంగా డిసెంబరు 2017లో తన పేరుపై భూమి రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని నమ్మబలికి అనిల్‌ను పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లి శ్రీనివాస్‌గౌడ్‌ తన పేరుపై పట్టా చేసుకున్నాడని బాధితుడు కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై పలుమార్లు అడిగినా స్పందించపోగా బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితుడు వాపోయాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని