చేపల వేటకు వెళ్లి.. చెక్‌డ్యాంలో మునిగి ఒకరి మృతి
eenadu telugu news
Published : 16/09/2021 02:10 IST

చేపల వేటకు వెళ్లి.. చెక్‌డ్యాంలో మునిగి ఒకరి మృతి


పుట్ట బిక్షపతి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి వల చుట్టుకుని చెక్‌డ్యాంలో మునిగి చనిపోయిన ఘటన వెల్దుర్తి మండలం దామరంచ గ్రామ పరిధి హల్దీవాగు చెక్‌డ్యాంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పుట్ట బిక్షపతి (56), లక్ష్మి దంపతులు బుధవారం సాయంత్రం 3 గంటల సమయంలో గ్రామ పరిధిలోని హల్దీవాగు చెక్‌డ్యాం చెంతనే ఉన్న పొలానికి వెళ్లారు. లక్ష్మి పొలంలోనే ఉండగా బిక్షపతి వల తీసుకుని చెక్‌డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వల విసిరే క్రమంలో అది కాస్తా బిక్షపతిని చుట్టుకోవడంతో అనుకోకుండా ఆయన నీటిలో పడిపోయాడు. గమనించిన ఆయన భార్య గట్టిగా కేకలు వేయడంతో సమీప పొలాల్లోని రైతులు వచ్చి బిక్షపతిని నీటిలో నుంచి వెలికి తీయగా అప్పటికే చనిపోయాడు. వారికి ఇద్దరు కొడుకులు మల్లేశం, అశోక్‌, కూతురు యశోద ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని