పల్లె.. పురపాలికల్లో నేటి నుంచి అందరికీ టీకా
eenadu telugu news
Published : 16/09/2021 02:10 IST

పల్లె.. పురపాలికల్లో నేటి నుంచి అందరికీ టీకా

ఈనాడు, హైదరాబాద్‌: అందరికీ టీకా అందించే కార్యక్రమంలో భాగంగా శివారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభం కానుంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, దాదాపు 900 గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ జరగనుంది. 20 రోజుల్లోగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖాధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బుధవారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, మేడ్చల్‌ ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ ఇరు జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. వైద్య బృందాలు గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి టీకాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రంగారెడ్డి , మేడ్చల్‌ జిల్లాల వైద్యారోగ్య శాఖాధికారులు స్వరాజ్యలక్ష్మి, మల్లికార్జునరావు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని