అమ్మే.. నాన్నను చంపింది!
eenadu telugu news
Updated : 16/09/2021 12:29 IST

అమ్మే.. నాన్నను చంపింది!

తండ్రిది ఆత్మహత్య కాదని గుట్టు విప్పిన కుమారుడు

జూబ్లీహిల్స్‌: భర్త గుండెపోటుతో మృతిచెందాడంటూ భార్య.. భర్త సోదరుడికి సమాచారం ఇచ్చింది. కాకినాడ వెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.. అనుకోకుండా మృతుడి కుమారుడు బాబాయి వద్దకు వెళ్లి అమ్మే చంపిందని చెప్పడంతో మృతుడి సోదరుడు సమన్‌సాయి ప్రసాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి చెందిన జగదీష్‌(43), రాజేష్‌(40) సోదరులు. జగదీష్‌ 2007లో ఓ యువతిని పెళ్లి చేసుకోగా వారికి కుమారుడు(11) ఉన్నారు. కొద్ది ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన జగదీష్‌.. ఫిలింనగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నాడు. జగదీష్‌ డ్రైవరు కాగా ఆమె సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తోంది. జులై 15న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె.. తన మరిది రాజేష్‌కు ఫోన్‌ చేసి జగదీష్‌ గుండెపోటుతో మృతిచెందాడని చెప్పింది. దీంతో అంతా కలిసి జులై 16న కాకినాడకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తిచేశారు. అనంతరం ఆమె కాకినాడలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈనెల 9న రాజేష్‌ ఇంటికి వచ్చిన జగదీష్‌ కుమారుడు.. ‘అమ్మే నాన్న మెడకు చున్నీ చుట్టి చంపడానికి ప్రయత్నించిందంటూ’ బాబాయికి చెప్పాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని