రెండు తలల పాము విక్రయానికి యత్నం
eenadu telugu news
Published : 16/09/2021 03:41 IST

రెండు తలల పాము విక్రయానికి యత్నం

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: రెండు తలల పాము మీ ఇంట్లో ఉంటే అదృష్టం కలిసొస్తుందని రూ.70 లక్షలకు విక్రయించబోయిన ఓ ముఠాను అటవీశాఖ విజిలెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సగుర్తి రోహిత్‌, జాలిగ శ్రీధర్‌, రాయుడు వెంకటరమణ, ఆంజనేయప్రసాద్‌ ఇటీవల ఘట్‌కేసర్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు తలల పామును పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వారిని నాగారంలోని ఓ ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగున్నర కిలోల పాము, కారు, ద్విచక్ర వాహనం, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాముకు రెండు తలలు ఉండవని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అది ఇంట్లో ఉంటే అదృష్టమనేది అపోహ మాత్రమేనన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని