టీకాలతోనే సాధారణ పరిస్థితులు
eenadu telugu news
Published : 16/09/2021 03:41 IST

టీకాలతోనే సాధారణ పరిస్థితులు


బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న రంగారెడ్డి, డా.దీపక్‌, ప్రొ.విద్యాసాగర్‌, జీవిఎస్‌ మూర్తి, డా.ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ

మాదాపూర్‌, న్యూస్‌టుడే: భారత్‌లో కరోనా మూడోదశ వచ్చే అవకాశాలు తక్కువన్నారు నిపుణులు. బుధవారం హైటెక్స్‌లో ‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌ ఇండియా అండ్‌ వరల్డ్‌’ అంశంపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ జి.వి.ఎస్‌.మూర్తి, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ డా.ఎం.విద్యాసాగర్‌, డాక్టర్‌ రెడ్డి ల్యాబరేటరీస్‌ ఏపీఐ, సర్వీసెస్‌ సీఈఓ దీపక్‌సప్రా, మెడికవర్‌ ఆసుపత్రి సీనియర్‌ ఇంట్రావెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ వైద్యులు డా.ఎం.ఎస్‌.ఎస్‌.ముఖర్జీ, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డా.రంగారెడ్డిబుర్రి చర్చించారు. నవంబర్‌ 12-14 వరకు జరిగే పబ్లిక్‌ హెల్త్‌ ఇన్నోవేషన్స్‌ కాన్‌క్లేవ్‌ ప్రదర్శన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.


20 టీకాల్లో 8 మాత్రమే వినియోగం: డా.రంగారెడ్డి బుర్రి

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 20 టీకాలు ఆవిష్కరించగా 8 వినియోగంలో ఉన్నాయి. మరో 300 టీకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా సోకినా తీవ్రత తగ్గటం, వచ్చినా మరణాలు తక్కువే.


జీవనవిధానంలో మార్పు తప్పనిసరి: డా.జి.వి.ఎస్‌.మూర్తి

కాలానుగుణంగా మనిషి తన జీవనవిధానాన్ని మార్చుకోవాలి. మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి. వ్యాక్సిన్‌తో కరోనా రాదని కచ్చితంగా చెప్పలేం. ఒకవేళ వచ్చినా ప్రభావం తక్కువ.


వైరస్‌కు దేశ సరిహద్దులతో పనిలేదు : దీపక్‌సప్రా

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 3.3 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. యూఏఈలాంటి దేశాల్లో 90 శాతం, యూకేలో 70 శాతం, యూఎస్‌లో 65 శాతం, ఇండియాలో 40 శాతం పూర్తవగా నైజీరియాలాంటి దేశాల్లో 2 శాతం కూడా నమోదు కాలేదు. 60 దేశాల్లో ఒక్కరు కూడా టీకా తీసుకోలేదు.


ఆరోగ్యం విషయంలో పారదర్శకత ఉండాలి : డాక్టర్‌ ముఖర్జీ

వ్యాక్సినేషన్‌ తరువాత కరోనా బారినపడినా తీవ్రత తక్కువ. టీకాల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ చాలా తక్కువ. ప్రజల్లో అవగాహన కల్పించి పారదర్శకత పాటించాలి. గ్రామీణ ప్రజలందరు టీకా వేసుకునేలా చర్యలు తీసుకోవాలి.


తీవ్రత అంతగా ఉండకపోవచ్చు - ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌

దేశంలో పెద్దల జనాభా 94 కోట్లు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోంది. ఇలానే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి 80 శాతం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో సహజ రోగనిరోధకశక్తికి టీకా తోడుకావడంతో మూడోదశ ఉండకపోవచ్ఛు వచ్చినా తీవ్రత అంతగా ఉండకపోవచ్ఛు ప్రస్తుత డెల్టా వేరియంట్‌తో రోజుకు 60 నుంచి 70 వేలకు మించి కేసులు పెరిగే అవకాశం లేదు. కొత్త వేరియంట్‌ వచ్చినా దాని బలం ప్రస్తుత వేరియంట్‌ కంటే 50 శాతం అధికంగా ఉన్నా రోజు వారి కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా లక్షన్నరకు మించవు. రెండో దశలో మరణాల కంటే చాలా తక్కువగా ఉంటాయి. వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులపై సర్వే చేయగా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని