భరోసా కేంద్రాన్ని సందర్శించిన భారత పార్లమెంట్‌ మహిళా భద్రతా కమిటీ సభ్యులు
eenadu telugu news
Published : 16/09/2021 03:41 IST

భరోసా కేంద్రాన్ని సందర్శించిన భారత పార్లమెంట్‌ మహిళా భద్రతా కమిటీ సభ్యులు


భరోసా కేంద్రాన్ని సందర్శించిన పార్లమెంట్‌ మహిళా భద్రత కమిటీ

నారాయణగూడ: మహిళా భద్రత కోసం భారత పార్లమెంట్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించింది. పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ హీనా విజయకుమార్‌ గావిట్‌ నాయకత్వం వహించారు. సీపీ అంజనీకుమార్‌, అదనపు సీపీ (నేరాలు-సిట్‌) శిఖాగోయల్‌ తదితరులు సాదరంగా ఆహ్వానించారు. భరోసా కేంద్రం పనితీరును వారికి వివరించారు. ఆరేళ్లలో భరోసా కేంద్రం దాదాపు పది వేల కుటుంబాలకు చేరువైందని అంజనీకుమార్‌ అన్నారు. డి.వి కేసులు 7536, పోక్సో కేసులు 1438, అత్యాచారం కేసులు 465, ఇతర కేసులు సుమారు 873 పరిష్కరించిందన్నారు. పార్లమెంట్‌ సభ్యులు మాలోతు కవిత తదితరులతోపాటు లోక్‌సభ డైరెక్టర్‌ ఎం.ఎల్‌.కె.రాజా, అదనపు డైరెక్టర్‌, లోక్‌సభ కమిటీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కమిటీ ఆఫీసర్‌, జాయింట్‌ సెక్రెటరీ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని