Saidabad: బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ.. రూ.20లక్షల చెక్కు అందజేత 
eenadu telugu news
Updated : 16/09/2021 10:10 IST

Saidabad: బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ.. రూ.20లక్షల చెక్కు అందజేత 

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు నడుమ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందించారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నిందితుడు రాజును కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా, మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఎటువంటి సమాచారం లేకుండా హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్‌ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని