నీటి గుంతలో పడి బాలుడి మృతి
eenadu telugu news
Updated : 16/09/2021 17:12 IST

నీటి గుంతలో పడి బాలుడి మృతి

శామీర్‌పేట: సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తీసిన నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శామీర్‌పేట సీఐ సుధీర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి సునీల్‌ దంపతులు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలోని ఓ ప్రైవేటు వెంచర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు దనరాజ్‌(7), యువరాజ్‌(5). బుధవారం వీరిని ఇంటి వద్దే వదిలి పక్కనే ఉన్న వెంచర్‌లో తల్లిదండ్రులు పనిలో నిమగ్నమయ్యారు. సెప్టిక్‌ ట్యాంక్‌ కోసం తవ్విన నీటి గుంత వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు యువరాజ్‌ అందులో పడిపోయాడు. బుధవారం సాయంత్రం తల్లిదండ్రులు పని ముగించుకొని ఇంటికిరాగా యువరాజ్‌ కనిపించలేదు. పెద్ద కుమారుడిని అడగ్గా సరైన సమాధానం చెప్పకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. రాత్రి 12గంటలకు శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు  చేశారు. పోలీసులు గురువారం చుట్టుపక్కల ప్రాంతాలు వెతికారు. సెప్టిక్ ట్యాంక్‌లో తేలిన మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని